పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన సహకార సంఘం చైర్మన్
ఫోటో రైటప్, 20 బీడీఎన్, పుస్తకాలను అందిస్తున్న సహకార సంఘం చైర్మన్ అల్లే జనార్దన్
బోధన్, జూలై ( జనంసాక్షి ) : బోధన్ మండలం సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిచిన పాఠ్య పుస్తకాలను బుధవారం సహకార సంఘం చైర్మన్ అల్లే జనార్ధన్ విద్యార్థులకు పంపిణీి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపిటిసి కండేల సవిత, గ్రామ పెద్దలు బుయ్యన్ సురేష్, ప్రధానోపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Attachments area