పాడి పశువుల పెంపకంతో- రైతులు ఆర్థికంగా అభివృద్ధి

మల్దకల్ ఎంపీపీ వై రాజారెడ్డి
మల్దకల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) మండల పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో మంగళవారం స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జపాన్ దేశం వారి అర్థిక సహకారంతో వడ్డీలేని రుణాలను మహిళలకు పంపిణీ చేశారు.బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా పిల్లలను వివిధ పనుల నుండి విముక్తి చేసినటువంటి బాల కార్మిక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు దాసరిపల్లి గ్రామంలో ఆవులను రెండు కుటుంబాలకు ఇవ్వడం జరిగినది.ఒక్క ఆవు యూనిట్ విలువ 30వేలు,వడ్డీ లేని రుణాలు 60 వేలు విలువ చేసే రెండు ఆవులను మల్దకల్ మండల ఎంపీపీ వై.రాజారెడ్డి దాసరిపల్లి సర్పంచ్ భరత్ రెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వై.రాజారెడ్డి మాట్లాడుతూ స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.స్పీడ్ సంస్థ ఇస్తున్నటువంటి ఆవులను పోషిస్తూ పెంపకం చేసుకుంటే పాడిపశువుల ద్వారా పాలను పాల కేంద్రాలకు, ప్రజలకు అమ్ముకుంటే వచ్చే ఆదాయం ద్వారా కుటుంబ పోషణకు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. పాడిపశువుల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు.ఆవు పేడ,ఆవు మూత్రం ద్వారా మంచి ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామ సర్పంచ్ భరత్ రెడ్డి  మాట్లాడుతూ స్పీడ్ సంస్థ వారు మా గ్రామమును దత్తత తీసుకొని గ్రామంలోని బడి బయట ఉన్నటువంటి బాల కార్మిక పిల్లలను చదివించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ వెంకటన్న. సింగల్ విండో డైరెక్టర్ పాగుంట.స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజర్ మధులత,స్పీడ్ సంస్థ అధ్యక్షుడు జీఎస్ రవిప్రకాష్, సిబ్బంది ఈరన్న,నవీన్,తిమ్మరాజు,సరళ,నరేష్,వెంకటమ్మ,సువార్త,జీవరాజు,గోవిందు,ఉరుకుంద,సవరన్న, రవి గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Attachments area