పాతపద్దతిలోనే ‘పది’ పరీక్షలు
` 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయింపు
` విద్యాశాఖ వెల్లడి
హైదరాబాద్,ఆగస్ట్11(జనంసాక్షి):పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠకు విద్యాశాఖ తెరదించింది. పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు- వెల్లడిరచింది. ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం జివొ జారీ చేసింది. అయితే ఇటీ-వలే ఢల్లీిలోని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (కఈఊªు) నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు.దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూశారు. దీంతో పాత విధానాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత విధానం ప్రకారమే 20 శాతం ఇంటర్నల్ మార్కులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నట్లు- విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.