పాతరేట్లకు పాత సరుకు, కొత్తరేట్లకు కొత్త సరుకు అమ్మాలి
కందుకూరు, జూలై 18: ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు రైతులకు పాత సరుకు అయితే పాత రేట్లకు కొత్త సరుకు అయితే కొత్త రేట్లకు అమ్మాలని పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్ ఎడిఎ టి రమేష్‌బాబు అన్నారు. బుధవారం డివిజన్‌లోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందు ల షాపుల డీలర్లకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలను లైసెన్సు ఉన్న డీలర్ల వద్దన కొనుగోలు చేయాలని అలాగే కొనుగోలు చేసిన సరుకుకు రశీదులు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. డీలర్లు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పొందుపరిచే ముందు వారి బయోడేటా సిడిని వ్యవసాయ అధికారికి అందచేయాలని అన్నారు. హోల్‌సేల్, రిటైల్‌గా అమ్మకాలు సాగించేవారు విధిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఎరువుల దుకాణదారులు గోడౌన్‌కు ఏ సంవత్సరంకు ఆ సంవత్సరం తీసుకొని ఉండాలని అన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు రైతులకు ఇబ్బంది కలగకుండా అమ్మాలన్నారు. వారానికి రెండు సార్లు స్టాక్ రిపోర్టు ఎఓ కార్యాలయానికి అందించాలని అన్నారు. స్టాక్ రికార్డులు పక్కాగా ఉండాలని అన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఎంఆర్‌పి రేట్లకే అమ్మాలని అన్నారు. విజిలెన్స్‌వారు తరచు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. రెవెన్యూశాఖ సిబ్బంది కూడా తనిఖీలు చేయవచ్చునని అన్నారు. డీలర్లు పలు షాపుల వద్ద స్టాక్‌బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఓ గౌతం ప్రసన్న, డివిజన్ పరిధిలోని డీలర్లు పాల్గొన్నారు.