పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం

హైదరాబాద్: పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం జరిగింది. ఆటోలో ఉన్న ఉన్న మహారాష్ట్ర వాసి పై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటిచారు. గమనించిన స్థానికులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వైపు మహంకాళి పీఎస్ పరిధిలో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పటించారు. ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వేరు వేరు ప్రాంతాల్లో ఒకే విధంగా ఘటనలు జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.