పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే.., పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.., 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 90 మంది పూర్వ విద్యార్థులు.
జులై 17(జనంసాక్షి)
చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-92లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం చేవెళ్లలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి మధుర స్మృతులు, నాటి జ్ఞాపకాలు విద్యార్ధి దశలో చేసిన అల్లర్లు, గురువులను ఆట పట్టించిన తీరు పూర్వ విద్యార్థులు నెమరువెసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. 30 ఏళ్ళ తరువాత ఒకే చోట కలవడంతో వారి ఆనందాలకు అవుదులు లేకుండా పోయాయి. క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్ లను ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు బండారు ఆగిరెడ్డి, మల్గారి వెంకట్ రెడ్డి, మద్దెల నర్సింలు, కుంచం శ్రీనివాస్, కేసారం రాఘవేందర్ మాట్లాడుతూ… మనమంతా ఎక్కడ ఉన్నా స్నేహితులను మర్చిపోవద్దని, వాట్సప్ గ్రూప్ ద్వారా స్నేహితుల బాగోగులు తెలుసుకోవాలని, ఎవరైనా అనారోగ్య కారణం, ఆర్థికంగా సతమతమవుతున్న వారికి ఆర్థికంగా ఉన్నవారు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉన్నారని పలువురు ఆనందం వ్యక్త పరిచారు. రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధిరంగాలలో, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. గ్రూప్ ఫొటోలు దిగి కొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 90 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.
Attachments area
వెళ్ల జులై (జనంసాక్షి
)చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-92లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం చేవెళ్లలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి మధుర స్మృతులు, నాటి జ్ఞాపకాలు విద్యార్ధి దశలో చేసిన అల్లర్లు, గురువులను ఆట పట్టించిన తీరు పూర్వ విద్యార్థులు నెమరువెసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. 30 ఏళ్ళ తరువాత ఒకే చోట కలవడంతో వారి ఆనందాలకు అవుదులు లేకుండా పోయాయి. క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్ లను ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు బండారు ఆగిరెడ్డి, మల్గారి వెంకట్ రెడ్డి, మద్దెల నర్సింలు, కుంచం శ్రీనివాస్, కేసారం రాఘవేందర్ మాట్లాడుతూ… మనమంతా ఎక్కడ ఉన్నా స్నేహితులను మర్చిపోవద్దని, వాట్సప్ గ్రూప్ ద్వారా స్నేహితుల బాగోగులు తెలుసుకోవాలని, ఎవరైనా అనారోగ్య కారణం, ఆర్థికంగా సతమతమవుతున్న వారికి ఆర్థికంగా ఉన్నవారు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉన్నారని పలువురు ఆనందం వ్యక్త పరిచారు. రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధిరంగాలలో, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. గ్రూప్ ఫొటోలు దిగి కొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 90 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.
Attachments area