పాదయాత్ర,భారీ భహిరంగ సభకు సంభందిత వాల్ పోస్టర్ ఆవిష్కరణ.పాదయాత్ర,భారీ భహిరంగ సభకు సంభందిత వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సమస్యల పరిష్కారానికై ఈ నెల 12 న చేపట్టిన పాదయాత్ర,ఈ నెల 28 న నిర్వహించే భారీ భహిరంగ సభను యూనియన్ సభ్యులు జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కోటగిరి మండల కన్వీనర్ వాంగ్మారే రాజేశ్వరి పిలుపునిచ్చారు.గురువారం కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పాదయాత్ర,భారీ భహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను యూనియన్ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.పర్మినెంట్,స్పెషల్ స్టేటస్,వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానం రద్దుకై గ్రామపంచాయతీ సిబ్బంది కోసం ఈ నెల 12 న జనగామ జిల్లా పాలకుర్తిలో పాదయాత్ర చేపట్టి,17 రోజుల పాటుగా 300 కిలోమీటర్ల పొడువున ఈ పాదయాత్ర కొనసాగి ఫిబ్రవరి 28న మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జాతీయ కోశాధికారి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాల ని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి నన్నేసాబ్,కారోబార్ లు రజిని,జాకీర్ హుస్సేన్, కార్మికులు శంకర్,లక్ష్మణ్, లింగవ్వ,తదిత రులు పాల్గొన్నారు.