పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో బాబు
నాలుగేళ్ల పాలన వదిలి విపక్షాలపై విసుర్లా?
అమరావతి,జూన్29(జనం సాక్షి ): దాదాపు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన టిడిపి తన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి అదే బిజెపిని, వైకాపాను నిందిస్తూ రాజకీయంగా లబ్దిపొందేందుకు నానాయాతన పడుతోంది. కడప ఉక్కునే తీసుకుంటే దానికి జగన్ పాపామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భావించడం లేదు. సమస్య ఏదైనా దానికి జగన్‌నో లేదా, కాంగ్రెస్‌నో తిడుతూ వచ్చిన టిడిపి ఇప్పుడు ఆ జాబితాలో బిజెపిని చేర్చి తిట్ల దండకాన్ని చేపట్టింది. అధికారంలో ఉన్న పార్టీగా ధర్నాలు, ర్యాలీలు చేస్తూ విపక్షాలకు సమస్యలు లేవన్న రీతిలో కొత్త ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఎపిలో గత నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఎంతసేపు విభజన పాపాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఎపిలో తెలంగాణ ఉద్యమం ఎగసినప్పుడు దూరదృష్టితో ఆంధ్రాలో అభివృద్దికి చర్యలు తీసుకుని ఉంటేఇవాళ నిందించే అవసరం వచ్చి ఉండేది కాదు. అలాగే నాలుగేళ్ల బిజెపితో కలసి అంటకాగిన సమయంలో కూడా విపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని ఉమ్మడిగా ఎపి అభివృద్దికి ముందుకు సాగివున్నా ఇవాళ నిందించే అసవరం ఉండేది కాదు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల ముచ్చట్లు ఒకవైపు, మూడు పార్టీల సిగపట్లు మరోవైపు సాగుతున్న దశలో బిజెపి మాత్రం అధికరమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నిజానికిఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ¬దాతో సహా విభజన హావిూలు ఎందుకు అమలు కాలేదు. ఎన్నికల ప్రణాళికలో ఆ మేరకు హావిూ ఇచ్చిన బీజేపీ, ప్రత్యేకించి ప్రధాని మోదీ అమలు చేయలేదనే చెప్పాలి. దీనికి చిత్తశుద్ది లోపం తప్ప మరోటి కాదు. నాలుగేళ్లుగా వైకాపా అనేక సమస్యలను లేవనెత్తుతూ వస్తోంది. చివరకు ప్రత్యేక¬దా కోసం ముందుండి పోరాడింది. ఇప్పుడు ఎటూ కాకుండా ఐదురుగు ఎంపిలను వృధాగా త్యాగం చేసింది. ఈ దశలో ఏపీ హక్కుల కోసం ఉమ్మడి పోరాటం చేయడాన్ని పక్కన పెట్టి పరస్పరం నిందా రాజకీయాలు నడుపుతున్నారు. రాష్టాన్రికి జరిగిన నష్టం ఏమిటో గుర్తించకుండా అన్ని పార్టీలు రాజకీయ స్వలాభమే లక్ష్యంగా సాగుతున్నాయి. కేంద్రం తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడే బదులు కేవలం తెలుగుదేశం జెండాలతో రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్లడానికే బాబు ఇష్టపడుతున్నారు. కేసుల భయంతో వారు రాజీ పడ్డారని వీరు, కేసులు పెడతారని వీరు లొంగిపోయారని వారు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజల అసంతృప్తి అర్థం చేసుకున్న చంద్రబాబు ఆఖరి నిముషంలోనైనా వ్యూహం మార్చి బీజేపీపై విమర్శలు మొదలు పెట్టారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ప్రత్యేక¬దాపై మొదటి దశలోనే పవన్ మాట్లాడారు. కాని జనసేనతో కమ్యూనిస్టులు కలసి పనిచేయడాన్ని అపహాస్యం చేయడం రాజకీయ కుసంస్కారం తప్ప మరొకటి కాదు. జనసేన ఇంకా చాలా స్పష్టత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.