పారిశుధ్యం పై అధికార యంత్రాంగం పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలి:: జిల్లా కలెక్టర్ జి రవి

 

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

వ్యాధులు ప్రబలకుండా యాంటీ లార్వా స్ప్రే చేయాలి

వరద నీరు నిల్వలను మోటార్ల ద్వారా తొలగించాలి

వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి

లోని పలు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల జూలై 18:- గ్రామాల్లో పారిశుధ్యం పై అధికార యంత్రాంగం పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించారు.

భారీ వర్షాల కారణంగా గ్రామాలలో అపరిశుభ్రత అధికంగా ఉందని, వీటిని తొలగించేందుకు పంచాయతీ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వరద నీరు అధికంగా రావడం వల్ల వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

జగిత్యాల లోని చింతకుంట చెరువు పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భారీ వర్షాల కారణంగా గుంతలు మురుగునీటి కాలువలు దోమలు ప్రబలకుండా యాంటీ లార్వా స్ప్రే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

అనంతరం జగిత్యాల రూరల్ మండలంలోని చల్గాల్ గ్రామం లో ని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని, దోమలు వ్యాప్తి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

పాఠశాలకు హాజరు కాని విద్యార్థులు ఫాలోఅప్ చేయాలని, ప్రతి విద్యార్థికి స్క్రీనింగ్ చేయాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులు ఆదేశించారు.

అనంతరం జగిత్యాల రూరల్ మండలం లోని మోర పల్లి, చల్గాల్ గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండకుండా మోటార్లతో తీసివేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాలలో ఎంత మంది జనాలు వచ్చే వారి పరిస్థితి వివరాలను కలెక్టర్ సర్పంచ్ అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాయికల్ మండల కేంద్రంలో కూలిపోయిన ఇండ్లను, కుంటలను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం కోరుట్ల మండలంలోని ఐలాపూర్ మజ్జుల చెరువు, సంగయ్య ఫంక్షన్ హాల్ దగ్గర ఇళ్లలోకి వచ్చిన వరద నీరు, కల్లూరు రోడ్ రైల్వే బ్రిడ్జ్ చెరువును కలెక్టర్ పరిశీలించారు .

అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్ తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.