పారిశ్రామిక వృద్ధిరేటు నిరాశాజనం : ప్రణబ్‌

న్యూఢిల్లీ : పారిశ్రామిక వృద్ధిరేటు 0.1శాతానికి పడిపోవడంపట్ల కేంద్రమంత్రి ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యావశ్యక ప్రోత్సాహకాలు అందజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.నాకు చాలా నిరాశ కలిగింది. పారిశ్రామిక ఉత్పత్తి ఏమీ పెరగలేదు. కొన్ని నెగిటివ్‌ సెంటిమెంట్లు వృద్ధి రేటును ప్రభావితం చేశాయి. ఇండస్ట్రీకి ప్రోద్బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్‌ బాగా నిరాశపర్చిందని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. మొత్తం 22 పారిశ్రామిక రంగాల్లో పన్నెండింటి ఫలితాలు మాత్రమే పాజిటివ్‌ వృద్ధి సాధించాయని ఆయన వివరించారు.

తాజావార్తలు