పార్టీలో యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి

టిడిపిలో వారికి ప్రాధాన్యం పెరగాలి: అయ్యన్న

విశాఖపట్నం,జూలై4(జ‌నం సాక్షి ): భాజపా, వైకాపా మినహా రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి టిడిపి సిద్ధంగా ఉన్నదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తెదేపాతో వైకాపా ఎలాగూ కలవదని ఆ పార్టీ మాకో పెద్ద శత్రువని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పార్టీ భాజపా అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో యువతకు ఎక్కువగా అవకాశం ఇస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని ముఖ్యమంత్రికి చెప్పానని అయ్యన్నపాత్రుడు అన్నారు. యువత కూడా ఉత్సాహంగా ఉన్నారని, టిడిపి పట్ల భరోసాతో ఉన్నారని అన్నారు. అలాంటి వారిని ఆదరించాల్సి ఉందన్నారు. టిడిపి రైల్వేజోన్‌ దీక్ష సందర్భంగా ఆయన తనను కలసిని విూడియా మిత్రులతో మాట్లాడారు. రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధిని నిజంగా చిన్న పార్టీలు కోరుకుంటే వారితో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పనిచేసే వారిని ప్రజలు ఎప్పుడూ వదులుకోరని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. జనసేనతో కట్‌ చేశామని ఎప్పుడైనా చెప్పామా.. చంద్రబాబుగానీ, మేముగానీ జనసేనతో కలిసి పని చేయమని ఎప్పుడూ చెప్పలేదే అని అయ్యన్న వ్యాఖ్యానించారు. రాష్టాన్రికి ఏదో చేయాలన్న తపన ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని అన్నారు. ఆయన మాటల్లో ఆ తపన కనిపిస్తోందని.. అది నెరవేరాలంటే.. సరైన నాయకత్వం, సలహాదారులు, వ్యక్తులు ఉండాలని సూచించారు. అందరం కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన ఉండాలన్నారు. చిన్నపార్టీలతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. జగన్‌లాంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి ఆయన అర్హుడు కాడన్నారు. అధికారం వారసత్వంగా రాదని ప్రతిభ ఉంటే వస్తుందని చెప్పారు. తనకు గంటా సహా ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. పార్టీలో అభిప్రాయభేదాలు ఉండడం సహజమన్నారు. ర్సీపట్నం నుంచే రాజకీయం ప్రారంభించానని ఇక్కడే రిటైరవుతానని అయ్యన్న వ్యాఖ్యానించారు. 1983లో ఎన్టీఆర్‌ పిలిచి మరీ టిక్కెట్టు ఇచ్చారన్నారు. కొందరు అక్కడికి ఇక్కడికి మారుతుంటారని.. నేను మాత్రం ఒకే స్థానంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణతో గెలిచానన్నారు. /ూజకీయం.. వారసత్వం కాదని, వారసత్వ రాజకీయాలకు ఇది రాజుల యుగం కాదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. మా అబ్బాయి విజయ్‌ ప్రతిభ చూసి పోటీకి చంద్రబాబు అవకాశం ఇస్తే తాను తప్పుకుంటానని.. అయ్యన్నపాత్రుడి వారసుడిగానో, లోకేష్‌ స్నేహితుడిగానో గుర్తించి టిక్కెట్టు ఇస్తామనంటే మాత్రం ఒప్పుకోనని అన్నారు. విశాఖలో భూ కుంభకోణాల గురించి మంత్రి స్థాయిలో తొలిసారిగా మాట్లాడానని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన స్పందించి సిట్‌ విచారణకు ఆదేశించి మంచి అధికారులను వేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ది అన్నది కేవలం టిడిపికే సాధ్యమని అన్నారు.