పార్టీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం
రంగారెడ్డి : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన బసచేసిన రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో ఈ భేటీ జరగనుంది. ఈసమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు తెదేపా శ్రేణులతో చర్చించనున్నారు.