పార్లమెంటకు అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము బిజెపికి ఉందా!
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయం న్యాయవాది సురేష్ మహారాజ్
అలంపూర్ సెప్టెంబర్ 16(జనంసాక్షి )తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయమని, భారత పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము బిజెపి నాయకులకు ఉన్నదా అని న్యాయవాది సురేష్ మహారాజ్ అన్నారు . అలంపూర్ పట్టణంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనానికి బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే అంబేద్కర్ పేరు పెట్టి తమ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలకు చూపాలన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలో కూడ బిజెపి ప్రభుత్వమే ఏర్పడే విధంగా ఇతర పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందర్ని బెదిరిస్తూ, కొందరికీ కాంట్రాక్టర్ పనులు ఇస్తూ బిజెపి పార్టీలోకి వచ్చే విధంగా కేంద్రప్రభుత్వం పని చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో బిజెపి గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో మొత్తం బీజేపీ అనుకూలంగా ఉందని, బిజెపి నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నాఅన్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా, పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై, ఆరోపణలు చేయడమే వారి పనిగా ఉందని ఆయన అన్నారు.అంతే కాకుండా 2023 లో జరిగే ఎన్నికలలో బిజెపి నే రాష్ట్రంలో అధికారంలోకి తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటూ తిరిగే దేశ, రాష్ట్ర నాయకుల కల నీటిమీద గీత గానే ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని అయన అన్నారు.
75 సంవత్సరాల క్రితం రచించినటువంటి భారత రాజ్యాంగంలో ప్రవేశ పెట్టినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఆవిర్భవించిందని,తెలంగాణ స్వరాష్ట్రం కోసం పార్లమెంటును సైతం కదిలించి తెలంగాణ సిద్దించుకున్నామని, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే జరిగిందని, తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పేట్టాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గం ప్రజల తరపున న్యాయవాది సురేష్ మహారాజ్ ధన్యవాదములు తెలియజేసారు.