పార్లమెంట్‌ ముట్టడికి పోరుబిడ్డల యత్నం

సోనియా ఇంటి ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నా
చివరిసారిగా అడుగుతున్నాం..
ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పాతరే : జనజాతరలో కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రభం’జన’మైంది. పోరు బిడ్డలు జై తెలంగాణ నినాదాలతో ధూం తడాకా చూపించారు. హస్తిన వీధులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో మార్మోగాయి. తెలం గాణవాదులు పార్లమెంట్‌ వైపునకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు, రక్షణ బలగాలు వారిని అడ్డుకొ న్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసం టెన్‌ జన్‌పథ్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. జంతర్‌మం తర్‌ ఉద్యమకారులతో సందడిగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పలు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్‌ మిగతా 2లోచేశారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న అలక్ష్యాన్ని నిరసిస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సంసద్‌ సత్యాగ్రహ దీక్ష మంగళవారం సాయంత్రం ముగిసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ ప్రభుత్వానికి తెలియజేయడానికి చేపట్టిన ధర్నాలో సుమారు మూడు వేల మంది తెలంగాణవాదులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, ధర్నాకు ఎంతో మంది జాతీయ నాయకులు వచ్చి మద్దతు తెలిపారని అన్నారు. ఈ ధర్నా ద్వారా తమ ఆకాంక్షను మరోమారు ఢిల్లీకి వినిపించామన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్టాన్న్రి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీ జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. తెలంగాణవాదులు తమ తడాఖా చూపించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వెళ్లారు. ‘సంసద్‌యాత్ర’ ముగిసిన అనంతరం జంతర్‌మంతర్‌ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణవాదులు బయలుదేరి పార్లమెంట్‌ వైపు దూసుకు పోయేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. జైతెలంగాణ నినాదాలు చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలిగిస్తూ పార్లమెంట్‌ వైపు దూసుకు పోయారు. అయితే పోలీసులు తెలంగాణవాదులను అడ్డుకుని లోనికి రాకుండా కట్టడి చేశారు. దీంతో అక్కడ ఉధ్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, మాల మహానాడు కార్యకర్తలు పార్లమెంట్‌లోకి దూసుకెళ్లారు. బిల్లును ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లోకి దూసుకెళ్లిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అరెస్ట్‌ను లెక్క చేయకుండా వారు తెలంగాణ నినాదాలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
సోనియా ఇంటి ఎదుట..
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం ఉదయం యత్నించాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దేవీప్రసాద్‌ నేతృత్వంలో తెలంగాణలవాదులు భారీ ర్యాలీగా సోనియా నివాసం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మొహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోనియాగాంధీ కార్యాలయ ఓఎస్‌డికి ఉద్యోగ సంఘాలనేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాసగౌడ్‌, దేవీప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలకు చెందిన అయిదుగురుం బుధవారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేస్తే ఆ ప్రాంతంలోని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం ఖాయమని ప్రకటించారు.