పాలకుర్తి గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాయం : ఝాన్సీ యశస్విని రెడ్డి

కొడకండ్ల, అక్టోబర్ 31(జనం సాక్షి)
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని జిబి తండా, హాక్య తండ గ్రామంలో
కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో భాగంగా
ఝాన్సీ యశస్విని రెడ్డికి
బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పాల్గొన్నా అనంతరం మాట్లాడుతూ
రాబోయే ఎన్నికల్లో ఊసరవెల్లి దయాకర్ రావు తరిమికొట్టేందుకు ప్రజలందరూ నడుంబించాలిని,
పేదలకు భూములు ఇవ్వాలన్న, ఇండ్లు కట్టించలన్న, మన పొలాలకు నీళ్ళు రావాలన్న, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, పరిశ్రమలు ఏర్పాటు జరగాలన్న రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.గత తొమ్మిది
సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి తొమ్మిది సంవత్సరాల చేయని అభివృద్ధి, ఐదు సంవత్సరాలు చేసి చూపిస్తామని,
దళిత బందు ఇయ్యలే, బీసీ బందు ఇయ్యలే, గిరిజన బందు ఇయ్యలే, డబల్ బెడ్ రూమ్ ఇయ్యలే, గృహలక్ష్మి ఇయ్యలే,
అన్నీ బంద్ చేసిన బి ఆర్ ఎస్ సర్కారును కూడా డిసెంబర్ 30 తేదీన బంద్ చేద్దాం అని ప్రజలకు సూచించారు.
రాబోయే ఎన్నికల్లో 45 రోజులు మీరు నాకోసం కష్టపడండి, వచ్చే ఐదేళ్లు మీ అభివృద్ధి కోసం నేను కష్టపడతానని,
నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతాన్ని కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తానని,
రాబోయే ఎన్నికల్లో ఈ దగా దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ఒక సైనికులు లాగా పనిచేయాలి పార్టీ నాయకులుకు కార్యకర్తలుకు అభిమానులు సూచించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..