పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి కావడంతో ఇప్పుడు ఉత్సవాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 4న జరిగే స్వామి వారల కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగాణంలో నింతరం విద్యుత్‌ సరఫరా, తాగు నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్‌శాఖ భద్రత కల్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలించడానికి ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి పాలకుర్తికి బస్సుల ట్రిప్పులు పెంచాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగాణంలో క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు.