పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల

భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
— జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
మహబూబ్ నగర్ ,జులై 26 ,(జనంసాక్షి ) :
     వివిధ ప్రాజెక్టుల కింద పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు . మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి భూసేకరణ పై ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, తాహసిల్దారులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదాల ప్రాజక్టులు, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉద్యాన పంటల భూసేకరణ ,అదే విధంగా పెండింగ్లో ఉన్న పీవీ, డిడి ల ప్రచురణ వంటివి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు .ఉద్యాన, ఆర్ అండ్ బి, ఫారెస్ట్ అధికారులు సాధ్యమైనంత త్వరగా వారి ప్రక్రియలను పూర్తి చేస్తే అంత త్వరగా అవార్డులు పాస్ కావడానికి అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణకై తీసుకున్న భూములలో చెట్ల విలువలను కూడా లెక్కించాలని కలెక్టర్ సూచించారు.ఉదండాపూర్   బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణకు ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడైనా ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి భూ సేకరణ నోటిఫికేషన్ పంపించాల్సి ఉంటే పంపించాలని అన్నారు. ధరణిలో భూసేకరణకు సంబంధించిన 2021 ఉన్న ఉన్న అన్ని కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉదండాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి, వల్లూరు ఆర్ అండ్ ఆర్, అలాగే ఉదండాపూర్ తదితర భూసేకరణ పై కలెక్టర్ సమీక్షించారు. అవార్డు పాస్ చేయాల్సిన చోట తక్షణమే పాస్ చేయాలని అన్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద పి ఎన్ కు ప్రతిపాదించామని, డీడీని ప్రచురించాల్సి ఉందని స్పెషల్ కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను ఆదేశించారు .   రైల్వే డబుల్ లైన్ కు సంబంధించి సకాలంలో భూసేకరణను పూర్తి చేసినందుకు గాను రైల్వే అధికారులు,సంబంధిత తహశీల్దారులు,ఆర్ డి ఓ లను ఆయన అభినందించా. తాహసిల్దారులు పెండింగ్ లో ఉన్న ధరణి కేసులన్నింటిని పరిష్కరించాలని, కష్టం మిల్లింగ్ రైస్ పై దృష్టి సారించాలని, అదేవిధంగా గ్రామాలలో నెలరోజుల పాటు పారిశుధ్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, స్థానిక సంస్థల అసనపు కలెక్టర్ తేజస్  నందలాల్ పవర్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్, జాతీయ రహదారుల సంస్థ ప్రాజక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు  ,పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉదయ శంకర్, తాహసిల్దార్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.