పాలేరులో గెలుపు మాదే
– ఉత్తమ్ కుమార్ ధీమా
ఖమ్మం,మే14(జనంసాక్షి): పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం రాంరెడ్డి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వైసీపీ, టీడీపీ అంగీకరించినప్పటికీ టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఒప్పుకోలేదని దీంతో ఎన్నిక అనివార్యమైందని ఆయన అన్నారు. ఐదున్నర దశాబ్దాలుగా పాలేరుకు రాంరెడ్డి చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. పాలేరును అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అని అన్నారు. డబ్బు, మందులతో ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు. అయినప్పటికి ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పాలేరు ఎన్నికల ప్రచారం సాయంత్రిం ముగిసింది. దీంతో చివరిరోజు పాలేరులో పార్టీలన్నీ ¬రా¬రీగా ప్రచారం నిర్వహించాయి. తెరాస ప్రభుత్వం అధికార బలంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తునారని ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో తెరాస అధికార బలంతో పోటీలోకి దిగడం సరైంది కాదన్నారు. పాలేరులో చేయాల్సి అభివృద్ధి కార్యక్రమాలను ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళల పట్ల గౌరవం లేదని విమర్శించారు.