పాలేరులో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

3

– 45,125 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల గెలుపు

ఖమ్మం,మే19(జనంసాక్షి):ఊహింఇనట్లుగానే ఖమ్మం జిల్లా పాలేరులో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. ఆ ఆపరట్‌ఈ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఘనవిజయం సాధించారు. పాలేరు ఉప ఎన్నికలో పోటాపోటీ ప్రచారంలో ప్రజలు  తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఘనవిజయం కట్టపెట్టారు.  ఎన్నికలేవైనా సరే గెలుపు టీఆర్‌ఎస్‌దేనని పాలేరు ఉప ఎన్నికలు మరోమారు నిరూపించాయి. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రాంరెడ్‌ఇ వెంకట్‌ రెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుచరితారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబి ఓడిపోయారు. భర్త సానుభూతి ఏ మాత్రం ఇక్కడ పనిచేయలేదు. కాంగ్రెస్‌ ఎంతగా ఆరోపించినా, హేమాహేవిూలు వచ్చి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు భారీ మెజార్టీతో అంటే  45,129 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి తుమ్మల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రతిరౌండ్‌లోనూ తుమ్మల ఆధిక్యం కొనసాగింది. తెలంగాణ అధికారపక్షం అంచనాలకు తగ్గట్లే భారీ అధిక్యతను సొంతం చేసుకోవటం గమనార్హం. తొలి రౌండ్‌ నుంచి తుమ్మల తన అధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు. తొలి రౌండ్‌లో 5426 ఓట్ల అధిక్యతతో తన ఖాతాను మొదలుపెట్టిన తుమ్మల రెండో రౌండ్‌ నాటికి పదివేల అధిక్యతకు దగ్గరకు వచ్చారు. నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 16446 ఓట్ల అధిక్యతలో ఉన్న ఆయన ఆరో రౌండ్‌ ముగిసేసరికి 20884 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 15వ రౌండ్‌ ముగిసేసరికి తుమ్మల 41,473 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. ఇక.. 16 రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 44050 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే మెజార్టీ అధికంగా ఉన్న నేపథ్యంలో తుమ్మల విజయం సాధించినట్లైంది. తుమ్మల విజయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. కమ్యూనిస్టులు పత్తా లేకుండా పోయారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ కూటమి పోటీని ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి సుచరితా రెడ్డి, సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌ పోటీ చేసిన విషయం విదితమే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. సీఎం కేసీఆర్‌ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు పాలేరు నియోజకవర్గ ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ గెలుపు అనంతరం తుమ్మల విూడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వంపై, తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఉన్నందునే ఈ విజయం సాధ్యమైందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే

భారీ మెజార్టీని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. పాలేరుకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పాలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేఏందుకు కృషి చేస్తానని అన్నారు.