పాలేరులో ప్రారంభమైన పోలింగ్
పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 93,463, మహిళలు 96,869 మంది ఉన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో 1520 మంది పోలింగ్ సిబ్బంది, 25 మంది సెక్టోరియల్ ఆఫీసర్స్, 25 మంది సహాయ సెక్టోరియల్ ఆఫీసర్లు, 25 మంది రూట్ ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 243 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వాటిలో 74 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 68 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, సాధారణ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఈ ఉప ఎన్నికల్లో 12 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు రెడ్‌కార్పట్‌తో స్వాగతం పలుకనున్నారు. వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం, ఓటర్లకు తాగేందుకు చల్లని మినరల్ వాటర్, షామియానాలు, ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటరు ఎవరికి ఓటు వేశామని తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.