పాలేరులో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

1

– 90 శాతం పోలింగ్‌ నమోదు

ఖమ్మం,మే16(జనంసాక్షి):పాలేరు ఉపఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలు ముగిసేసరికి 90 శాతంగా నమోదైంది. 1,62,715 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సుమారు 40 గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నారు. అధికార పార్టీ (తెరాస) అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌, తెదేపా, వైకాపా ఉమ్మడి అభ్యర్థిగా సుచరితారెడ్డి, సీపీఐ, సీపీఎం ఉమ్మడి అభ్యర్థిగా పోతినేని సుదర్శన్‌ బరిలో ఉన్నారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.ఉదయం పోలింగ్‌ ప్రారంభం నుంచి ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుండటంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉప ఎన్నిక పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని దికారులు వివరించారు.  తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటింగ్‌ పక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఈసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  తీవ్రమైన ఎండల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుందని తెలిపారు.  6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 93,463,నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం