పాలేరు గుప్‌ చుప్‌..

1

– 16 పోలింగ్‌.. 19 కౌంటింగ్‌

ఖమ్మం,మే14(జనంసాక్షి): ఈ నెల 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం శనివారంతో ముగిసింది. గత వారం పదిరోజులులగా వివిధ పార్టీలో ¬రా¬రీ ప్రచారం నిర్వహించాయి. ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టిఆర్‌ఎస్‌ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్‌ నుంచి సుచరితారెడ్డి, సిపిఎం నుంచి పోతినేని సుదర్శన్రావుఉల పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో అధికార టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావునే అభ్యర్థిగా బరిలోకి దింపడం నుంచి సగానికిపైగా కేబినెట్‌ను ప్రచారంలో నిమగ్నం చేయడం దాకా టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ శ్రేణులను ఇక్కడ దింపి ప్రచారాన్ని ఉదీథంచేసింది. లెఫ్ట్‌ పార్టీలు సిపిఎం, సిపిఐ ప్రచారం చేశాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని, భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక విధంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించడమే కాకుండా మొత్తం నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి కె.తారక రామారావును నియమించారు. అభ్యర్థి తుమ్మల సహా పది మంది మంత్రులు పాలేరులో ప్రచారంలో పాల్గొన్నారు.   టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ ఎన్నికను  సవాలుగా తీసుకుని ప్రచారం నిర్వహించింది. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు మొదలు ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతరలుఉ అంతా వెల్లిపోవాలని ఎన్నికల అధికారులు ఆదేశిచారు. ఇన్‌చార్జి మంత్రులతోపాటు మంత్రి కేటీఆర్‌ సహా అంతా శనివారం తిరుగుముఖం పట్టారు. మరోవైపు పాలేరు నుంచి రెండుసార్లు వరుసగా గెలిచిన కాంగ్రెస్‌…ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తిగా పాలేరులోనే మకాం వేసి ప్రచారం చేసింది. ఉతతమ్‌ కుమార్‌ రెడ్డి,జానారెడ్‌ఇ, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, వివేక్‌, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ప్రాచారంలో ముమ్మరంగా తిరిగారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా వారికి అండగా నిలిచింది. రేవంత్‌ రెడ్డి తదితరులు ప్రచారంలో కాంగ్రెస్‌కుమద్దతు తెలపడం విశేషం. కాగా, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ రావు కోసం కోసం మరో వామపక్ష పార్టీ సీపీఐ మద్దతివ్వగా ఇతర వామపక్షాలూ తమ స్థాయిలో ప్రచారం చేసాయి. 19న జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.