పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని న్యూ డెమోక్రసీ నేతలు  తెలిపారు. అన్నారు. ఈనెల 6న ఆ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోపలు గ్రామాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. పాలకులు పేదలకు భూములు పంచకపోగా ఉన్నవి కూడా లాక్కుంటున్నారని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా హరితహారంపేరుతో లాక్కునే ప్రయత్నలు చేస్తున్నారని అన్నారు.2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల పోడు భూములన్నింటికి పట్టాలు ఇవ్వవలసిందేనన్నారు. విమానాశ్రయాలు, ఉపరితల గనులు, సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతుల పేరుతో ఆదివాసీ ప్రాంతాలను బొందల గడ్డలుగా మార్చుతున్నారని ఆవేదన చెందారు. గోదావరి చెంతనే ఉన్నా సీతారామ ప్రాజెక్టు ద్వారా అశ్వాపురం మండలానికి సాగునీరు అందించకుండా పాలేరుకు గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు.