పింకీ మగాడే… తేల్చి చెప్పిన మెడికల్‌ రిపోర్ట్స్‌

కేసు ఫైల్‌ చేసిన కోల్‌కత్తా పోలీసులు

కోల్‌కత్తా ,నవంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): లింగనిర్థారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ అథ్లెట్‌ పింకి ప్రామినిక్‌కు చుక్కెదురైంది. వైద్య పరీక్షల్లో ఆమె మగాడని తేలింది. దీంతో కోల్‌కత్తా పోలీసులు పింకిపై రేప్‌ , మోసం కేసులు నమోదు చేశారు. 30 ఏళ్ళ మహిళ ఫిర్యాదుతో గత జూన్‌లో పింకి అరెస్టైంది. ఆసియా క్రీడలలో బంగారు పతకం గెలిచిన ఈ మాజీ అథ్లెట్‌ స్త్రీ కాదని పురుషుడంటూ కోల్‌కత్తాకు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనపై అత్యాచారం కూడా చేశాడని దానిలో పేర్కొంది. ఇంత కాలంగా అందరినీ మహిళనంటూ నమ్మించిందని తెలిపింది. అతను తనను రేప్‌ చేశాడని , ప్రస్తుతం తాను గర్భవతినంటూ చెప్పిన ఆ మహిళ పెళ్ళి చేసుకోమంటే నిరాకరించాడని కంప్లైంట్‌లో పేర్కొంది. దీంతో స్పందించిన పోలీసులు పింకిని అరెస్ట్‌ చేశారు. అయితే పింకికి చేసిన పరీక్షలలో ఫలితాలు అసంపూర్తిగా రావడం మరింత గందరగోళానికి దారి తీసింది. రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అయితే రెండింటిలోనూ ఖచ్చితమైన ఫలితాలు రాలేదు. సరైన సదుపాయాలు లేకపోవడంతో 11 మంది మెడికల్‌ బోర్డు బృందం సైతం పింకి మహిళా , పురుషుడా అనేది నిర్థారించలేకపోయారు.  దీంతో చివరికి క్రోమోజోమల్‌ టెస్ట్‌ ద్వారానే సరైన లింగనిర్థారణ జరుగుతుందని భావించి కోర్టు ఆ పరీక్ష కోసం ఆదేశించింది. దానిలో పింకి మగాడేనని వైద్యులు తేల్చారు. దీనిపై వెంటనే స్పందించిన కోల్‌కత్తా పోలీసులు పింకిపై రేస్‌ , మోసం కేసు ఫైల్‌ చేశారు. ప్రస్తుతం ఈ మాజీ అథ్లెట్‌ బెయిల్‌పై బయటే ఉంది. త్వరలోనే పోలీసులు పింకిని అరెస్ట్‌ చేయనున్నారు. మాజీ అథ్లెట్‌ పింకీ ప్రామానిక్‌ 2006 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించింది. ఆమె మహిళల 4ఞ400 విూటర్ల టీమ్‌ రిలేలో ఈ పతకం నెగ్గింది. అదే ఏడాది మెల్‌బోర్న్‌ కామన్‌వెల్త్‌గేమ్స్‌లో కూడా సత్తా చాటి వెండి పతకం గెలిచింది. మూడేళ్ళ క్రితం పింకీ ప్రామానిక్‌ అథ్లెటిక్స్‌ నుండి రిటైర్మెంట్‌ ప్రకటించింది.