*పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలి*

మునగాల, జూలై    (జనంసాక్షి): మునగాల మండలంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మునగాల మండలంలో ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్లు, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి పింఛన్ల కోసం అప్లై చేసుకున్న వారు మండల వ్యాప్తంగా చాలామంది ఉన్నారని వారు అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఎంపీడీవో కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి అనేకమంది పింఛన్దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శించినారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్దారులకు 57 సంవత్సరాలు ఉన్న వారికి మంజూరు చేస్తామని చెప్పి వాగ్దానాలను అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు. ఎన్నికల ముందు పేదలకు అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం .8 సంవత్సరాల కాలంలో పేదలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మండల వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులకు వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులు మంజూరు చేయాలని మంజూరు చేయని యెడల పింఛన్దారులతో ఎంపీడీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని మేదరమెట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.