పిఆర్టియు టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
శ్రీరంగాపురం:సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
పిఆర్టియు టిఎస్ శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు దాసరి చిన్నరాములు, ప్రధాన కార్యదర్శి వసంతపురం రాజు గార్ల ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి ఉదయం తాటిపాముల పాఠశాలలో ప్రారంభమై మండలంలోని అన్ని పాఠశాలల్లో కొనసాగి వెంకటాపురం ఉన్నత పాఠశాలలో విజయవంతంగా ముగిసింది.ఇట్టి కార్యక్రమంలో భాగస్వామ్యులైన ఉపాధ్యాయులు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అడుగడుగునా నీరాజనాలు అందించి పిఆర్టియు టిఎస్ సంఘం వెంటే నడుస్తామని ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు.
పిఆర్టియు టీఎస్ వెంటే ఉపాధ్యాయ లోకం మండల అధ్యక్షులు దాసరి చిన్నరాములు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందన చూసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ సంఘ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లు మండల అధ్యక్షులు దాసరి చిన్నరాములు అంచనావేశారు. అనునిత్యం ఉపాధ్యాయుల పక్షపాతం వహిస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పిఆర్టియు టిఎస్ సంఘం ముందుకెళ్తుందన్నారు.సీపీస్ రద్దు పిఆర్టియు టిఎస్ తోనే సాధ్యం జిల్లా అధ్యక్షులు సూగూరు వరప్రసాద్ రావు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ సీపీఎస్ ను పూర్తిగా రద్దు చేయించే బాధ్యత పిఆర్టియు టిఎస్ సంఘం తీసుకుంటుందని,దానికి అనుగుణంగా త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అతి త్వరలో ఏకీకృత సర్వీసు రూలు సమస్య పరిష్కారమై ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరుగుతాయన్నారు.ఉపాధ్యాయ సమస్యల సాధన దిశగా గౌరవ ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోరెడ్డి బౌద్ధారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వరప్రసాద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రవీందర్ గౌడ్, శివశంకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, పెబ్బేరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దయానంద్ , దుర్గా ప్రసాద్, మండల కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Attachments area
|