పిఎం ఏఏజీవై పథకం కింద తొలివిడతగా 39 గ్రామాల ఎంపిక.

*కనీస అవసరాలు తీర్చేందుకు 7.80 కోట్లు విడుదల చేసిన కేంద్రం. ఎంపీ సోయం బాపూరావ్.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆడి ఆవాస్ యోజన ( pm aay) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో  39 గిరిజన గ్రామాలు  ఎంపిక చేసిందని త్వరలోనే గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపొందించి పనులు అమలు చేయనున్నట్టు ఎంపీ సోయంబాపురావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎంపికైన గిరిజన గ్రామాల జాబితాను ఓ ప్రకటన ద్వారా ఎంపీ సోయం బాపు రావు విడుదల చేశారు. ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఒక్కో గ్రామానికి తొలి విడుదల 20 లక్షల నిధులు కేంద్రం కేటాయిస్తున్నట్టు తెలిపారు. దశలవారీగా ఉమ్మడి జిల్లా పరిధిలో 204  మారుమూల గ్రామాలను ఎంపిక చేసి ఐదేళ్లపాటు నిరంతరాయంగా దశలవారి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం తోపాటు అంగన్వాడీల మరమ్మతులు ఇతర అభివృద్ధి కనీస అవసరాలు తీర్చడం జరుగుతుందన్నారు. తొలి విడతగా అదిలాబాద్ జిల్లాలో 24 గిరిజన గ్రామాలు కొమరం భీం జిల్లాలోని 15 గిరిజన గ్రామాల్లో ఏడు కోట్ల 80 లక్షలతో బీడీసీల సహకారంతో పనులు చేపడతామని ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎంపీ తెలిపారు. ఈ మేరకు ఈ రెండు జిల్లాల్లో ఎంపికైన గిరిజన గ్రామాలు జాబితా ఇలా ఉంది.
Attachments area