పిడుగుపాటుకు ఐదుగురు మృతి

జార్ఖండ్‌లో గాలివాన బీభత్సం
రాంచీ,మే21(జ‌నం సాక్షి):  జార్ఖండ్‌లో పెనుగాలులు, ఉరుములు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలో అయిదుగురు మృతి చెందారు. రాజధాని రాంచీలో ఒక్క గంటసేపు కురిసిన వర్షం 54.4 మిల్లీ విూటర్లుగా నమోదైంది. గంటకు 60 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీచాయి. రాంచీలోను, పరిసర ప్రాంతాల్లోనూ పలు చెట్లు నేలకూలాయి. రాంచీలోని ఒక మైదానంలో చెట్టు కింద ఉన్న ఒక వ్యక్తి పిడుగుపాటుకు, మృతి చెందాడని, రాంచీ జగన్నాథ్‌పూర్‌ ఇన్‌ఛార్జి అధికారి కర్మాకర్‌ తెలిపారు. గుమ్లా జిల్లాలో కుసుంటోలిలో పదేళ్ల చిన్నారి, వేర్వేరు జిల్లాల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. ఈ వర్షాలు రుతు పవనాల ప్రవేశానికి ముందస్తుగా వచ్చేవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.  క్యుములోనింబస్‌ మేఘాలూ కారణమని పేర్కొన్నారు.