పిల్లలందరికీ ఆల్బొండా జోల్ గోలీల పంపిణీ*
మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 15 నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ గోలీలను గురువారం సాతారం గ్రామంలో,మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంతోపాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు ఆల్బెండజోల్ గోలీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చిన్నారులు మట్టిలో ఆడడం, గోళ్లు ఉండటంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం ద్వారా కడుపులో నులిపురుగులు తయారవుతాయని తద్వారా పిల్లలకు ఆకలి మందగించి రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పిల్లలు చేతులను పరిశుభ్రం చేసుకోవాలని చేయని యెడల రక్తహీనత పెరుగుతుందని సూచించారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, మెడికల్ సిబ్బంది సహకారంతో తప్పనిసరిగా పాఠశాలల్లో ఆల్బెండజోల్ గోలీలను ప్రతి విద్యార్థికి వేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ ,ఎంపిటిసి గున్నాల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు డి రవీందర్, ఉప సర్పంచ్ మెడకోకుల శ్రీనివాస్, ఏఎన్ఎం పద్మ,అంగన్వాడి టీచర్ మమతా రాణి, వనిత, అన్నపూర్ణ, ఆశా వర్కర్లు ,లతా పద్మ ,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.