పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసిన ఎంపిపి స్వరూప
రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి);
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి గంగం స్వరూప మహేష్ అన్నారు.రుద్రంగి మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచితంగా వచ్చిన స్కూల్ యూనిఫామ్ దుస్తులను ఎంపిపి గంగం స్వరూప మహేష్,సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తూ ప్రభుత్వం విద్యార్థులను విద్యలో మరియు క్రీడలలో ప్రోత్సహిస్తుందని తెలిపారు.
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో
ప్రదనోపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మన్ అశోక్ నాయకులు చెప్యాల గణేష్,గొళ్ళెం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.