పిల్లలలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే విధంగా విద్య సంస్థలు కృషి చెయ్యాలి ఛైర్పర్సన్

కోదాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్.ఆర్.ఎం వికాస్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  పాల్గొని  కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరిపే చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాల వారు బాలోత్సావ్ నిర్వహించడం, అభిందనీయమన్నారు, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పిల్ల‌లంద‌రికి  విద్య, క్రీడలు, సైన్స్ తదితర అంశాలపై అవగాహన కలిగించే విధంగా ఎన్ ఆర్ ఎం విద్యాసంస్థలు వారు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది కేవ‌లం చిన్నారులలోని ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి మాత్ర‌మేన‌ని, జయాపజయాలకు కృంగి పోకుండా ఉండే మనస్తత్వం ను అలవరుచుకోవాలి అని చిన్నారులకు, సూచించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు వార్డ్ కౌన్సిలర్స్ పెండెం వెంకటేశ్వర్లు షేక్ మధార్ సాహెబ్ ,తిపిరిశెట్టి సుశీల రాజు, ఎన్.ఆర్.ఎం స్కూల్ యాజమాన్య చైర్మన్ పిడుగు చంద్రవాసు, ప్రిన్సిపల్ దొడ్డి సైదులు, డి యం అభినందన్ , మరియు ఎమ్మెస్సార్ స్పోర్ట్స్ , యండి రఫీ, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.