పిల్లల అనారోగ్యానికి
అద్దం పట్టిన కాగ్
దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం, నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని
` ఈ పథకం మరింత ఎక్కువ మందికి చేరాలంటే డిసెంబర్2008 నాటికి 14 లక్షల అంగన్‌వాడి సెంటర్లు పనిచేయాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాని, ప్రభుత్వం 13.71 లక్షల సెంటర్లను మాత్రమే మంజూరు చేసింది. వాటిలో 13.17 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయి.
` కాగ్ పరిశీలించి అంగన్‌వాడిల్లో 61 శాతానికి సొంత భవనాలు లేవు. 25 శాతం పాకల్లోనో, ఆరు బయటో పనిచేస్తున్నాయి. 40`65 శాతం సెంటర్లకి వంటకోసం ప్రత్యేక స్థలం లేదు. ఆహార పదార్థాలు భద్రపరిచే చోటు లేదు. గది లోపల, ఆరు బయట పిల్లలకు నిర్వహించ వలసిన కార్యకలాపాలకి తగిన ప్రదేశం లేదు.
` పరిశుభ్రత లోపం కనిపిస్తుంది. 52 శాతం సెంటర్లకి మరుగుదొడ్లు లేవు. 32 శాతానికి మంచినీటి సౌకర్యం లేదు.
` పిల్లల బరువుతూచే మిషన్లు 26 సెంటర్లలో లేవు. గర్భిణీ స్త్రీల బరువు తూచే మెషిన్లు 58 శాతం సెంటర్లలో లేవు. (తూకం వేయకపోతే మెరుగుదలని నిర్దారించలేం.)
` అదనపు ఆహారాన్ని వండడానికి ఉపయోగించే గిన్నెలు చాలా సెంటర్లలో లేవు.
` దాదాపు 33`49 శాతం సెంటర్లలో మందుల సరఫరా కిట్‌లు లేవు. కేంద్రం నుంచి విడుదలైన నిధులను ఈ సెంటర్లలో వినియోగించిన రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్య ఫలితం ఇది.
` అన్ని స్థాయిల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది.
` ఆదనపు ఆహారం కోసం 2006`09లో మనిషికి 2.6రూపాయలు కేటాయిస్తే, 1.52 నుంచి 2.1రూపాయల వరకు మాత్రమే వాడారు. అలానే, 2009`11 కాలానికి మనిషికి 4.21రూపాయలు కేటాయిస్తే 3.8 నుంచి 3.64 రూపాయల వరకు మాత్రమే వాడారు.
` పిల్లల ఎదుగుదలని కోలవడానికి వారి బరువు తూయాలి. కాని 33 నుంచి 47 శాతం పిల్లల్ని అసలు తూయనే లేదు. అలానే, పిల్లల పోషణని సూచించే కొలతల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించవలసి ఉండగా, వాటిని గాలికి వదిలేశారు.
` గుర్తించిన లబ్దిదారుల్లో సేవలందిన లబ్దిదారులు 33 నుంచి 45 శాతం మాత్రమే ఉన్నారు.
` గోధుమ ఆహారం గల పథకంలో వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడిరది. మాతా శిశు అభివృద్ది శాకలకి, ఆహారం, ప్రజా పంపిణీ శాఖకి, రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య సయోధ్య లేదు. ఫలితంగా, రాష్ట్రాలు కోరిన ఆహార ధాన్యాల్లో 78 శాతం మాత్రమే సమకూరుతున్నాయి. అందులో మళ్లీ 66 శాతాన్ని మాత్రమే ఆయా రాష్ట్రాలు వినియోగించుకున్నాయి.
` దాదాపు 41`51 శాతం సెంటర్లలో ఆరేళ్ల లోపు బాలలకి అందించే అనియత విద్యకి సంబంధించిన ప్రీస్కూల్ కిట్స్ లేవు.
` ఈ పిల్లల్లో ఎంత మంది తర్వాత నియత విద్యని చేపట్టి ప్రధాన విద్యా వివస్థలోకి ఇమిడారో కూడా లెక్కలు లేవు. ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటకల్లో ఈ సంఖ్య 7 నుంచి 30 శాతానికి మించలేదు.
` చాలా రాష్ట్రాల్లో సమాచారం కోసం, శిక్షణ కోసం విడదలైన మొత్తంలో 40 మంది 100 శాతం నిధుల్ని వినియోగించనే లేదు.
` ఈ పథకంలో పనిచేసే ఉద్యోగుల కోసం 2008`09లో 13 రాష్ట్రాలకు, 2009`11లో 15 రాష్ట్రాకు మొత్తం 1753 కోట్ల రూపాయలు విడుదల కగా, వ్యయమైన మొత్తాన్ని 2853 కోట్ల రూపాయలుగా చూపించారు. అంటే,
అవాస్తవికమైన ఖర్చులు చూపించి, కీలకమైన విభాగాల నుంచి సొమ్ముని ఇతర రంగాలకు తరలించడం వంటి తప్పుడు పద్దతులు అవలంబించారు.
` దాదాపు 57.82 కోట్ల రూపాయల నిధుల్ని ఐసిడిఎస్ పరిధిలోకి రాని కార్యకలాపాలకు వినియోగించారు. పైగా 70.11 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో ట్రెజరీల్లో భద్రపరచడం వల్ల అవి వినియోగించే వీలు లేని విధంగా తాళం పడి ఉండిపోయాయి.
` కేంద్ర పర్యవేక్షక విభాగం తన పనిని సరిగ్గా నిర్వహించలేదు. ఎప్పటికప్పుడు ఈ పథకం పని తీరుని విశ్లేషించి, రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ద్వారా దాని బాగోగులని అర్థం చేసుకోలేకపోయాయి.
` ఈ పథకం కింద అందిస్తున్న సేవల వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో నిర్దారణలు లేవు. పిల్లల పోషకాహార స్థాయి వంటి సూచికలను ఈ పర్యవేక్షక బృందం పరిగణించలేదు.
` మంత్రిత్వ శాఖ స్థాయిలో అంతర్గత విశ్లేషణ, అంచనా అరకొరగా ఉండడం వల్లే పదే పదే అవే లోపాలు పునరావృతమవుతున్నాయని కాగ్ నివేదిక వెల్లడిరచింది.
అలా, అట్టడుగు వర్గ్గాల పిల్లలకు, స్త్రీలకు ఎంతో మేలు చేయగల సమగ్ర శిశు అభివృద్ది పథకం నిరర్ధకమైపోతుంది. అందుకే ఇంకా 47 శాతం మంది పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నారు. 50 శాతం మహిళల్లో రక్తహీనత కనిపిస్తోంది. 836 మిలియన్ ప్రజలు ఒంటి పూట భోంచేస్తున్నారు.ప్రపంచంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారణాల్లో ఆకలిది మొదటిస్దానం. క్షయ, మలేరియా, ఎయిడ్స్ వంటి వ్యాధులతో మరణించే వారి సంఖ్య కంటే ఆకలితో చనిపోతున్న వారి సంఖ్యే ఎక్కువ. ఆకలితో అలమటించే ప్రజల్లో 98 శాతం అభివృద్ది చేందుతున్న దేశాల్లోనే ఉన్నారు. వారిలో 15 శాతానికి పోషకాహార లోపం ఉంది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు పిల్లల్లో 2.6 మిలియన్లు పోషకాహార లోపంతో చనిపోతున్నారు.
అంటే, అది ప్రపంచంలో మూడవ వంతు, ఆరుగురు పిల్లల్లో ఒకరు పొట్టిగా ఉంటున్నారు(ఆహార లోపం వల్ల). ప్రాథమిక విద్యని అభ్యసించే పిల్లల్లో 66 మిలియన్లు ఖాళీ కడుపులతోనే స్కూలుకి వెళ్తున్నారు. హాజరు వేసే సమయంలో ఎంత మంది తిని వచ్చారో టీచర్లు లెక్కకడితే ఈ సంఖ్య బాధాకరంగా ఉంటుంది.
ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం రోజుకు 65 రూపాయలతో నడుస్తున్న కుటుంబాలు మన పేదరికానికి ఆద్దం పడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు పేదల్లో ఒకరు భారతదేశంలో ఉన్నారు. మూడు దశాబ్దాల క్రితం పేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మనది ఐదవ స్థానం ఎప్పుడు మనం శరవేగంగా పైకి ఎగబాకి, ఆఫ్రికన్ దేశాల సరసన నిలిచాం. ఈ కాలంలో పేదరికం 22 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. మన దేశంలో ప్రస్తుతం 40 కోట్లకి పైగా పేదలున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా. ఆ పేదల్లో 75 శాతం గ్రామల్లో నివసిస్తున్నారు. ప్రజలకి అందే వైద్య సేవలు నాసిరకంగా ఉండడం, పిల్లల్లో పాఠశాల విద్యకి దూరం కావడం వంటి అనేక సమస్యలు మన దేశంలో పేదరికం పెరగడానికి కారణమని కూడా ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది.
ఆయితే, పేదరికం, పోషకాహార లోపం అనేవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని, విషవలయంగా తయమారయ్యాయి. అలానే అంటువ్యాధులు, పేదరికం అనేది మరొక విషవలయం. ఇవి కాక, మన పరిసరాలు, పర్యావరణం కూడా ఈ పోషకాహార లోపానికి దోహదం చేస్తున్నాయి.
తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లకు, చెత్తని సక్రమంగా విసర్జించడం(పారిశధ్యం), కాలుష్యం, శబ్దం, నివాసం, గాలి, రేడియేషన్, క్రిమికీటకాలు, చట్టం అనే పది అంశాలతో నిర్దారించబడే పర్యావరణం కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఏ ఒక్కటీ సక్రమంగా లేకపోయినా, అది పోషకాహార లోపాన్ని పరోక్షంగా పెంచుతుంది. పేదరికం, ఆహార లోపం, కొనుగోలు శక్తి క్షీణించడం నిరుద్యోగం అదుపులేని అధిక ధరలు మాత్రం పోషకాహార లోపాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. (ఇంకావుంది)