పిల్లల ఆసుపత్రులను సమగ్ర విచారణ జరపాలి.
యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి జూలై 28:-
హనుమకొండ జిల్లాలోని చిన్న పిల్లల ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సమాఖ్య (యుఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ సాంబశివరావు డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు. అధిక రుసుము వసూలు చేయడం మరియు అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అనంతరం మాదం తిరుపతి మాట్లాడుతూ హనుమకొండ పట్టణంలోని చిన్న పిల్లల ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బులు అవసరం లేకుండా ఆపరేషన్లు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాయని, దీని వల్ల భవిష్యత్తులో రోగులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అధికారులు విచారణ చేయకపోవడంతో రోగులకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోగులకు నార్మల్ డెలివరీ కోసం కష్టపడాలని చెబుతున్నా యాజమాన్యాలు మాత్రం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆపరేషన్లు చేపడుతున్నాయన్నారు. కనీసం రోగులకు ఆపరేషన్ అవసరమో లేదో చెప్పకుండా యాజమాన్యాలు రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదన్నా చెప్పకుండా రోగులను అడ్మిట్ చేయడం తోపాటు ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. మొత్తంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రుల ఆపరేషన్లపై విచారణ చేయాలని అవసరం లేకుండా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు డబ్బులు తిరిగి ఇచ్చేలా అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల ఆసుపత్రులకు సంబంధించి జిల్లాకు చెందిన అధికారులు పలు ఆసుపత్రుల్లో అనుమతులు లేకుండా నడుస్తున్నాయని సిగ్గుచేటన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేయకుంటే కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వినతిపత్రం అందించిన వారిలో జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంద గణేష్, జిల్లా నాయకులు హరీష్, శ్రీనాథ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.