పిల్లల ప్రతిభను గుర్తించడానికి పోటీ పరీక్షలు
పేద మధ్యతరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను గుర్తించడానికి వ్యాసరచన చిత్రలేఖన క్యూజ్ పోటీ పరీక్షలు నిర్వహించామని సీపీఎం రాష్ట్ర నాయకులు మిల్కూరి వాసుదేవ రెడ్డి తెలిపారు.
కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నాలుగో తరగతినుండి పదవ తరగతి విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు బాలల సంఘం ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహించడం జరిగింది. అనంతరం వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ బాలవికాసమే భవిష్యత్తు పునాది చిన్నారులు ఎన్నో ఆలోచనలు ఎంతో ప్రతిభ మరింత ఆసక్తి సృజనాత్మక వారి ప్రతిభ పాఠాలను విన్నపెట్టి పట్టం కట్టే వీధికే పిల్లల పండగానే ఆయన అన్నారు. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14న పిల్లల పండుగగా దేశ దేశమంతట నిర్వహించడం ఒక ఆనవాయితీ అని అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులు అన్న భావనకు పెద్ద పిట్ట వేస్తూ పిల్లల కోసం బాలల సంఘం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. నెహ్రు దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు భారీ పరిశ్రమలు భారీ నీటిపారుదల ప్రాజెక్టు వంటి నిర్మాణాలకు దోహదపడ్డారు అన్నారు. లౌకిక విలువలకు పునాదువేశారని ఆయన అన్నారు. పిల్లల్లో శాస్త్రీయ అవగాహన అభివృద్ధికి సృజన శక్తికి దోహదపడే విద్య కోసం కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విజేతలకు అతిధులచే బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.గతంలో జిల్లా రాష్ట్ర స్థాయిలలో ప్రభుత్వమే పోటీ పరీక్షలు నిర్వహించారు కానీ నీటి ప్రభుత్వాలు పోటీలు నిర్వహించకుండా వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణలో నాయకులు తిరుపతి శ్రీకాంత్ నరేష్ పటేల్ అరవింద్ వంశీ రాము రోహిత్ వెంకటేష్ నవీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.