పిసిహెచ్‌సిల్లో నమోదు చేసుకుంటేనే కిట్
జనగామ,నవంబర్23(జనంసాక్షి): ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగయ్యాయని గర్భిణులు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని డీఎంహెచ్‌వో సూచించారు. జిల్లాలోని గ్రావిూణ గర్భిణులు అందరూ తప్పకుండా పీహెచ్‌సీలలో వైద్యం చేయించుకోవాలని డీఎంహెచ్‌వో తెలిపారు. పీహెచ్‌సీలలో గర్భిణులకు వైద్యం అందిచేందుకు అన్ని మండలాలలో ఏఎన్‌ఎమ్‌లను అందుబాటులో ఉంచి గ్రామాల్లో ఉన్నవారి పూర్తి వివరాలు సేకరించి కేసీఆర్‌కిట్ పథకానికి పేర్లు నమోదు చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు మొదటిసారి ఆస్పత్రికి వచ్చే ముందు ఆధార్‌కార్డ్, బ్యాంక్ ఆకౌంట్ పాస్‌బుక్‌తో పాటు మాతశిశు సంరక్ష పుస్తకం వెంట తీసుకురావాలని అన్నారు. మాతశిశు సంరక్ష పుస్తకం గర్భిణులు వేరే గ్రామాలకు వెళ్లినా అక్కడ ఈ బుక్‌లతో వెంటనే వైద్యం అందిస్తారని తెలిపారు. వైద్యం అందించడంలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్న గర్భిణులను దగ్గరుండి జనగామ ఏరియా ఆస్పత్రికి గాని, వరంగల్‌కు గానీ తరలించి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. గర్భిణులురెండోనెల పరీక్షకు వచ్చినప్పుడు వెంటనే అన్‌లైన్‌లో పేరు నమోదుచేసి రూ.3వేలు అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ పథకం పోందాలనుకునే వారు గ్రావిూణ గర్భిణులు అందరూ పీహెచ్‌సీలలో వైద్యం చేయించుకుంటేనే పథకానికి
అర్హులని అన్నారు.