పీడీపీ అధ్యక్షురాలుగా మహబూబా ఎన్నిక

3

శ్రీనగర్‌,జనవరి24(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ప్రధాన పార్టీ అయిన  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా శనివారం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పీడీపీ ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులు పార్టీ కార్యాలయంలో  సమావేశమయ్యారు. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలిగా మెహబూబాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2003 నుంచి మెహబూబానే పార్టీ అధ్యక్షురాలిగా ఉంది. ఈ సారి అధ్యక్షురాలిగా ఆమెను ఎన్నుకోవడానికి పార్టీ వర్గాల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్‌ సయ్యిద్‌ 2002 సంవత్సరంలో కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయనే సిఎం రేసులో ఉన్నారు. బిజెపితో జత కుదిరితే ముఫ్తీ సిఎం కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ రెండు పార్టీలు అధికారం పంచుకునే దిశగా పావులు కదుపుతున్నాయి.