పీహెచ్‌డీ ప‌ట్టా అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22 (జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా డిఈఓ గోవిందరాజు లు పర్యావరణ విద్య అంశంపై ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులపై అధ్యాయనం చేసి పీహెచ్‌డీ పూర్తి చేసి ప‌ట్టా అందుకున్నారు.
కొంత మందికి చ‌దువుకోవాల‌నే కోరిక ఉంటుంది.త‌మ‌కున్న బ‌రువు, బాధ్య‌త‌ల కార‌ణంగా స‌మ‌యం ఉండ‌టంలేద‌ని, అవ‌కాశం దొర‌క‌డం లేద‌ని చ‌దువును ప‌క్క‌న పెట్టేస్తారు కొంద‌రు.మ‌రికొంత ‌మంది ఉన్న స‌మ‌యాన్నేస‌ద్వినియోగం చేసుకుంటూ త‌మ ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు.స‌రిగ్గా అలాంటి కోవ‌కు చెందిన వారే నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు.
మహబూబ్ నగర్ బీఈడీ కళాశాలకు ప్రధాన ఆచార్యులు,నాగర్ కర్నూల్ నారాయణపేట జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఎన్నో బాధ్య‌త‌లు,స‌వాళ్లు త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుంది.విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు రాష్ట్ర, జిల్లాల ఉన్నతాధికారుల సమావేశాలకు హాజరవుతూనే, క్షేత్రస్థాయిలో అమలుపరిచేందుకు జిల్లా మండల స్థాయి విద్యాధికారులతో సమీక్షల నిర్వహణతో విద్యావ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో కుటుంబంతో గ‌డ‌ప‌డానికే ఒక్కోసారి స‌మ‌యం దొర‌క‌దు.అలా అని త‌న గోల్‌ను ఎప్పుడు ప‌క్క‌న పెట్టేయ‌లేదు. అనుకున్న‌ది సాధించి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్నారు. పర్యావరణ విద్య అనే స‌బ్జెక్టు మీద డీఈవో గోవిందరాజులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల నుండి గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. పీహెచ్‌డీ ప‌ట్టాను ఆయ‌న ఆయన అందుకున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 600 మంది ఉపాధ్యాయులపై అధ్యయనం.:

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 600 మంది సెకండరీ గ్రేడ్ సైన్స్ మరియు సోషల్ సబ్జెక్టుల ఉపాధ్యాయులపై అధ్యయనం చేశారు.ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్(స‌మాచార సాంకేతిక‌త‌) వినియోగంపై తాను గ‌త కొన్ని ఏళ్లుగా అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు డిఈవో గోవిందరాజులు తెలిపారు.ఈ పరిశోధన ఫలితాలను తరగతి గదుల్లో అమలు చేస్తే పర్యావరణం విద్యపై విద్యార్థుల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు అని ఆయన తెలిపారు. చేసి చేసిన త‌న ప‌రిశోధ‌న ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.పీహెచ్‌డీ పూర్తి చేయ‌డంలో త‌న‌కు స‌హ‌క‌రించిన గైడ్స్‌ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి, సోషల్ మరియు సైన్స్ ఉపాధ్యాయులు ఇత‌రుల‌కు ఆయ‌న ఈ సందర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.అలాగే డిఈఓ చేసిన పీహెచ్‌డీ పర్యావరణ విద్య అంశం కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులకు మ‌రింత ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల ప్రకటన వెలువడిన వెంటనే గురువారం నాగర్ కర్నూల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది డీఈవో డాక్టర్ గోవిందరాజులు ఘనంగా సన్మానించారు.