పుట్టగొడుగుల పెంపకం పై మహిళలకు శిక్షణ కార్యక్రమం

పుట్టగొడుగుల పెంపక విధానాన్ని వివరిస్తున్న గృహ విజ్ఞాన శాస్త్రవేత్త  సుగంధి
, జులై 18 (జనం సాక్షి):పుట్టగొడుగుల పెంపకం పై మహిళలకు శిక్షణ  అవగాహన కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం గడ్డి పల్లి లో  గృహ విజ్ఞాన శాస్త్రవేత్త  ఎన్. సుగంధి  నిర్వహించారు.  సోమవారం  కెవికె లో పుట్టగొడుగుల పెంపకం పై నిర్వహించిన  ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి. లవకుమార్  పాల్గొని  మహిళలు  నిరుద్యోగ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ఖాళీ సమయంలో ఈ పుట్టగొడుగుల పెంపకం ద్వారా మంచి పోషక ఆహారం తో పాటుగా  స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలియజేసారు. ఈ శిక్షణ లో ఎన్. సుగంధి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త  పుట్టగొడుగుల పెంపకానికి కావలసిన  నైపుణ్యత శిక్షణా అంశాల గురించి యువతులతో ఎలా చేయాలో  వివరించారు .  నూతనంగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టేవారికి  ఇంతకుముందు చేపట్టినవారికి  కెవికె ద్వారా శిక్షణా సాంకేతిక సలహాలు సూచనలు వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం యాజమాన్యం గురుంచి తెలియజేస్తు స్పాన్   ను సరఫరా చేస్తూ ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో  మహిళలు లయోల కళాశాల వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు మొత్తం 15 మంది పాల్గొన్నారు.

తాజావార్తలు