పులి దాడి నుండి ఓవ్యక్తి తప్పించుకున్నాడు
శంషాబాద్: మండలంలోని తొండుపల్లి శివారులో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక సీఎన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మూడు పిల్లలతో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ వ్యక్తిపై పులి దాడికి యత్నించగా అతను తప్పించుకున్నాడు. స్థానిక పోలీసులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.