పుష్కర కాలంగా నిరాహార దీక్ష పట్టువీడని ఇరోం షర్మిల ఢిల్లీకి

ఇంఫాల్‌, మార్చి 3 (జనంసాక్షి) :
సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 12 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారిణి ఇరోమ్‌ షర్మిలను ఆదివారం ఢిల్లీకి తరలించారు. కొన్ని కోర్టు కేసులకు ఆమె హాజరుకావలసి ఉన్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సంబంధించిన కేసులో ఇరోమ్‌ షర్మిల కోర్టు హాజరుకావలసి ఉంది. ఇంఫాల్‌ విమానాశ్రయానికి సమీపంలోని మాలోం ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌ చేతిలో 10 మంది పౌరులు హతమైన నేపథ్యంలో ఆమె 2000 సంవత్సరం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడి పాలకులు ఆమెకు ద్రవాహారం అందజేస్తూ చికిత్స అందిస్తున్నారు. 12 ఏళ్లుగా ఎలాంటి గణాహారం తీసుకోని షర్మిల ఎముకల గూడులా మారింది. ఆమెను తరలించే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.