పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: బొగ్గులకుంటలోని పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడి గోదాములోని 4 అంతస్తుల్లోకి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.