పూర్తియైన చంద్రబాబుకు వైద్యు పరీక్షలు
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబుకు ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. చంద్రబాబు కాలువాపు ఇంకా తగ్గలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబుకు చక్కెర స్థాయి సాధారణస్థితిలోనే ఉందని వైద్యులు వెల్లడించారు.