పూర్తి కావస్తున్న రామానుజుల విగ్రహం
రంగారెడ్డి,నవంబర్3(జనంసాక్షి):జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ధి సందర్భంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో నిర్మిస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం తొలి విడత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యటక పరంగా ఈ దివ్యక్షేత్రం రాష్ట్రానికే కాదు దేశానికే వన్నె తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ముచ్చింతల్‌లో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ దివ్యక్షేత్రం హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండనుంది. వేయి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 టన్నుల భారీ పంచలోహ విగ్రహం నిర్మాణ పనులు దాదాపు 90శాతానికిపైగా పూర్తయ్యాయి. విగ్రహం ఏర్పాటు దాదాపు పూర్తి చేశారు.