పెంచిన బస్సు పాస్ చార్జీలు తక్షణమే తగ్గించాలి.

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భాస్కర్
మక్తల్ జూలై 27 (జనంసాక్షి) పెంచిన బస్సు పాస్ చార్జీలు తగ్గించాలనీ pdsu అధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భాస్కర్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా బస్సు పాస్ చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్య కొనసాగిస్తున్నారు. అయితే వారికి వారి కుటుంబాలు కష్టం చేసుకొని జీవనం కొనాగిస్తుంటారు. అటువంటి కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్య కొనసాగిస్తున్నారు. వారికి ఫీజులు కట్టలేక పోతున్నారు. అయితే ప్రభుత్వం మళ్ళీ బస్సు పాస్ చార్జీలు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
మక్తల్ నుండి నారాయణపేట వెళ్ళాలి అనుకుంటే లేదా మక్తల్ చుట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు గత సంవత్సరం 150 నుండి 200 రూపాయలతో బస్సు పాస్ చార్జీలు ఉండేవి. ఈ సంవత్సరం 200నుండి 600 వరకు అయితున్నయి ఇలా పెంచడం వల్ల పేద విద్యార్థులు చదువును కొనసాగించడం చాలా కష్టం. నెలకు 200నుండి 600 కట్టాలి అంటే పేద కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన బస్సు పాస్ చార్జీలు తగ్గించి, అర్హులైన పేద విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సు నడపాలని PDSU తరుపున రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేస్తూన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో pdsu నాయకులు సాయిరాం, శివరాం, సుదర్శన్, అనిత, శేకర్ తద్దితర విద్యార్థులు పాల్గొన్నారు.