పెంచిన విద్యుత్,బస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. బీజేపీ శ్రేణుల నిరసన

కోటగిరి జూలై 21 జనం సాక్షి:- టి.అర్.ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్,బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ సీఎం,స్పీకర్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అద్యక్షులు కాపు గాండ్ల శ్రీనివాస్మాట్లాడుతూ.నిన్న టి.అర్.ఎస్ వాళ్ళు జి. ఎస్.టి పై చేసిన నిరసనను చూసిన ప్రజలు నవ్వుకొంటున్నారు.నేరుగా ప్రజలు,రైతుల వద్ద నిత్యావసర సరుకులు (పాలు,పెరుగు,కూరగాయలు,బియ్యం) తీసుకుంటే జి.ఎస్.టి వర్తించదని తెలువ కుండానే రాష్ట్రంలో పరిపాలన చేయడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర ప్రజలపై విద్యుత్,బస్ చార్జీల రూపంలో అధిక చార్జీలు వేసి సామాన్య ప్రజలకు నడ్డి విరుస్తు న్నారు.కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలి.లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ చార్జీల పెంపూపై మరిన్ని ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఎన్నికల హామీలో చెప్పిన కొత్త పిన్షన్స్,దళిత భందు,కొత్త రేషన్ కార్డులు,డబుల్ బెడ్రూం ఇండ్లు,దళితులకు మూడు ఎకరాల భూమి వంటి మాటలు గెలిచి మూడు సం.అయిన వోట్టి మాటలుగానే మిగిలయని ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వాన్ని హెగ్ధేవ చేశారు.ఈ కార్యక్రమంలో కులకర్ణి శామల  ఏములనవీన్,భజరంగ్,గురునాథ్,మక్కయ్యా,సూర్యకాంత్,బాబాన్న,సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area