పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే తగ్గించాలి

 బహుజన సమాజ్ పార్టీ గా నియోజక వర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్
. జులై    (జనం సాక్షి)
పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే  తగ్గించాలని
బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ డిమాండ్ చేశారు.
శుక్రవారం బీఎస్పీ కోదాడ మండల పార్టీ ఆధ్వర్యంలో పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని కోరుతూ   కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన ఆయన
మాట్లాడుతూ కోవిడ్‌ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు.
ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజుల వల్ల సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఓ మాదిరి స్కూళ్ల నుంచి కార్పొరేట్‌ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్నారని తెలిపారు.కోదాడ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగాయన్నారు. అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు,స్కూల్ ఫీజు,పుస్తకాలు, యూనిఫామ్స్,షూ, బెల్ట్,టై అని బాదేది కాకా,అదనంగా ఇప్పుడు డీజిల్‌ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజులంటూ, ఆటో చార్జీలు అంటూ  అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని,
ఒకవైపు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ,మరోవైపు ప్రైవేట్ స్కూల్లలో ఫీజులు పెంచుతూ
పేద,బడుగు బలహీన వర్గాలకు విద్యను అందకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫీజుల విషయం ఇలా ఉంటే మరికొన్ని స్కూల్లో మౌళిక సదుపాయాల కల్పించకుండా పాఠశాలలను నడుపుతున్నారని, ఇంకొన్ని స్కూల్లో ఐదవ తరగతి వరకు పర్మిషన్ తీసుకుని పదవ తరగతి వరకు నడిపిస్తున్నారని  అన్నారు.ఈ సమస్యలన్నీ గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో బీఎస్పీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోశాధికారి కందుకూరి ఉపేందర్, నియోజకవర్గం మహిళా కన్వీనర్ విజయనిర్మల, నాగమణి, కుడుముల నిర్మల, సోషల్ మీడియా ఇంచార్జి కర్ల ప్రేమ్, కంపాటి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.