పెంట శ్రావణి ని అభినందించిన కలెక్టర్

 

రాజాపేట,  డిసెంబర్7 (జనం సాక్షి): రాజపేట మండల కేంద్రం కు చెందిన మాంటిస్సోరి హై స్కూల్ విద్యార్థిని పెంట శ్రావణిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అభినందించారు. జిల్లాస్థాయి ఇన్స్పైర్ అవార్డు 2021-2022 విద్యా జ్యోతి హై స్కూల్ రాయిగిరి నందు నిర్వహిస్తున్న ప్రదర్శనలో మాంటిస్సోరి హై స్కూల్ రాజపెట పదవ తరగతి చదవుతున్న పెంట శ్రావని తను చేసిన సైన్స్ ప్రదర్శనఆటోమెటిక్ మెడిటేషన్ అలారం ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ను జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి , జడ్పీ చైర్మన్ చైర్మన్ ఎ సందీప్ రెడ్డీ , ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డీ , డివో నారాయణరెడ్డి ,పలువురు ఎంఈఓ లు,జిల్లా త్రస్మ అధ్యక్షులు జలంధర్ రెడ్డి సందర్శించి అభినందనలు తెలిపారు. ఆటోమేటిక్ మెడిటేషన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్
కాన్సెప్ట్ బాగుంది అని ఓల్డ్ ఏజ్ వాళ్ళకు బాగా అవసరం వస్తుంది అని కలెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.