పెండింగ్‌కేసులు పెనుసవాల్
– సుప్రీం చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్
సిమ్లా,ఆగస్టు 20(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. సిమ్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ… కేసుల పెండింగ్ వల్ల న్యాయవ్యవస్థ మొత్తంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ’80 శాతం అపరిష్కృత కేసుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి’ అని చెప్పారు. దీనికి న్యాయవాదుల కొరత ఉందన్నారు. దీనిపై కేంద్రానికి ఇప్టికే నివేదించారు. ఇటీవల పంద్రాగస్ట్ సందర్బంగా న్యాయమూర్తుల నియామకంలో జరగుతున్న ఆలస్యంపైనా చీప్ జస్టిస్ ఆవేదన చెందారు.