పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ.6,500 కోట్లు వందల కోట్లు కేటాయించండి

3

– కేంద్ర జలవనరుల బృందానికి తెలంగాణ సర్కారు వినతి

హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి      ప్రాజెక్టులను పూర్తి చేయడానిక ? 6 ,500 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభు త్వం కోరింది. కేంద్ర జలవనరుల పార్లమెంట్‌ సభ్యుల బృందం ఇందుకు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి తాము నివేదిస్తామని కమిటీ చైర్మన్‌ హుకుంసింగ్‌  హావిూ ఇచ్చారు. శనివారం నాడు హైదరాబాద్‌ వచ్చిన పార్ల మెంటరీ కమిటీకి  ఈ మేరకు టి.ఎస్‌ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. సత్వర సాగునీటి ప్రయోజనాల పధకం (ఎఐబిపి) కింద 2,155 కోట్లు ఇవ్వాలని,నాబార్డు నుంచి 42 80 కోట్లు మంజూరు చేయాలని టి.ఎస్‌. కోరింది. తెలంగాణలో జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై పార్లమెంటరీ కమిటీ శనివారం శంషాబాద్‌ నోవాటెల్‌ ¬టల్‌ లో సమావేశం నిర్వహించింది. ప్రజలకు రక్షిత మంచినీరు ఎలా సరఫరా చేస్తున్నారు ? భూగర్భ జలాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలు, చెరువులు, సరస్సులలో నీరు కలుషితం కాకుండా చేపడుతున్న కార్యక్రమాలు, చెరువులు కబ్జాకు గురికాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు? వంటి అంశాలపై పార్లమెంటు సభ్యుల బృందం వివరాలు సవిూకరించింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ , ఎఐబిపి, ట్రిపుల్‌ ఆర్‌ పథకాలపై టిఎస్‌ ఇరిగేషన్‌ అధికారులు ప్రజనీటేషన్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పధకాలు యావత్‌ దేశానికే మోడల్‌ గా నిలిచాయని 17 మందితో కూడిన పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించింది.కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యం బోర్డుల పనితీరును ఈ బృందం అడిగి తెలుసుకున్నది. కృష్ణా బోర్డు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కల్గించే నిర్ణయాలు తీసుకుంటున్నదని, తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఏ.పి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని టి.ఎస్‌ నీటిపారుదల ఉన్నతాధికారులు పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేశారు.