పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలి.

లేబర్ అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్వీపర్ల కు  గత మూడు నెలలుగావేతనాలు ఇవ్వకుండా సంబంధిత కాంట్రాక్టర్ కార్మికుల పట్లనిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని వేతనా లు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నా రని సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని జనరల్ ఆస్పత్రిలో జనరల్ ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ రఘు కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక హంగులతో నిర్మించిన అందులో పనిచేస్తున్న స్వీపర్ల కు  గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు గత 35 సంవత్సరాలుగా అందులో పనిచేస్తున్న స్వీపర్ల కు కనీస వేతనాలు అమలు చేయకుండా అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వీరి పట్ల లేబర్ అధికారులు గాని అధికారులు గాని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.కేవలం ఏడు వేల ఆరు వందల రూపాయల వేతనంతో 35 సంవత్సరాలుగా పని చేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల యొక్క పొట్ట కొడుతున్నారని కొత్త టెండర్ల ద్వారా ప్రతి బెడ్ కు 7వేల5వందలు అంటే ప్రతి కార్మికునికి 16వేల5వందలు రావాల్సి ఉన్నా  ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా  కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పాత టెండర్ ద్వారా వేతనాలు ఇస్తున్నారని  ఆయన అన్నారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాలకృష్ణమ్మ, రంజాన్ బి, గిరి, శేఖర్, బాలకృష్ణ, ఖలీల్, అలివేల, క్రిష్ణమ్మ, రేణుక, అలివేలమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Attachments area